News February 11, 2025
తగ్గుతున్న నాగార్జునసాగర్ నీటిమట్టం

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. సోమవారం సాయంత్రానికి స్పిల్ వే(546 అడుగులు) దిగువకు 543.80 అడుగులకు పడిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 593 అడుగులు కాగా.. ప్రస్తుత 543 అడుగులకు చేరింది. మరోవైపు ఎడమ కాలువకు ఆన్ ఆఫ్ విధానంలో నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ రైతుల డిమాండ్ మేరకు కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు.
Similar News
News February 24, 2026
ఐఐసీటీలో 16 పోస్టులకు ఇంటర్వ్యూ

<
News February 24, 2026
ENGvsPAK.. నేడు పాక్ ఓడితే సెమీస్ ఆశలు గల్లంతు?

T20WC సూపర్-8లో భాగంగా ఇవాళ గ్రూప్-2లోని ఇంగ్లండ్-పాకిస్థాన్ తలపడనున్నాయి. పల్లెకెలె వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే శ్రీలంకపై ఘన విజయం సాధించి జోరు మీదున్న ఇంగ్లండ్ నేడు కూడా గెలిస్తే సెమీస్‌కు చేరువవుతుంది. కివీస్‌తో మ్యాచ్ రద్దవడంతో ఇవాళ మ్యాచ్ పాకిస్థాన్‌కు కీలకం. ఓడితే సెమీస్ ఆశలు సంక్లిష్టమవుతాయి. న్యూజిలాండ్, శ్రీలంక జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది.
News February 24, 2026
SKLM: ఫిబ్రవరి 25న జాబ్ మేళా..రూ.16-26 వేలతో ఉద్యోగాలు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సీడాప్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25న శ్రీకాకుళం నెహ్రూ యువ కేంద్రం వద్ద జాబ్ మేళా జరుగనుందని డీఆర్‌డీఏ పథకం సంచాలకులు కిరణ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సంస్థలైన డీ-మార్ట్, ఫ్యూషన్ ఫైనాన్స్‌ల్లో అసోసియేట్ క్యాషియర్, పర్చేజ్, రిలేషన్‌షిప్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి టెన్త్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. 19-35ఏళ్లు ఉండాలన్నారు. రూ.16-26 వేలు జీతం ఇవ్వనున్నారు.


