News April 8, 2025

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: సీతక్క

image

ములుగు జిల్లాలో కురిసిన వర్షానికి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్‌ను మంత్రి సీతక్క ఆదేశించారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. మండలాల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధికారులతో పర్యటించి రైతులకు అండగా ఉండాలన్నారు.

Similar News

News September 18, 2025

మైథాలజీ క్విజ్ – 9

image

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>

News September 18, 2025

చిత్ర పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: సీఎం

image

సినీ కార్మికులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నైపుణ్య శిక్షణ, ఆరోగ్య బీమా కల్పించి, చిన్న బడ్జెట్ సినిమాలకు సహాయం చేస్తామన్నారు. HYDను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్దామని చెప్పారు. ‘గద్దర్ అవార్డులు’ కొనసాగిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలు స్వయంగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో, వారు కృతజ్ఞతలు తెలిపారు.

News September 18, 2025

డీఎస్సీ అభ్యర్థులకు 134 బస్సులు: డీఈవో

image

రేపు అమరావతిలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారని డీఈవో శామ్యూల్ తెలిపారు. వారిని అమరావతికి తీసుకెళ్లేందుకు 134 బస్సులను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,590 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ కొలువులు సాధించారని అన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు బస్సులు బయలుదేరుతాయని, అభ్యర్థులు ఉ.7 గంటల్లోపు అక్కడికి చేరుకోవాలని తెలిపారు.