News February 12, 2025
తడ: శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద రోడ్డు ప్రమాదం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739326038848_673-normal-WIFI.webp)
తడ మండలం శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీలో వస్తున్న వ్యక్తి వేగంగా ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. 108 ద్వారా స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 12, 2025
కరీంనగర్: ప్రభుత్వ ఆసరా అందేనా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739322477656_51946525-normal-WIFI.webp)
ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా కొత్త పింఛన్లపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్హులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత BRS ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 57 ఏళ్లకు ఆసరా పెన్షన్లు ఇస్తుందో.. లేదో అని ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
News February 12, 2025
బర్డ్ ఫ్లూ భయం.. రూ.150కే కేజీ చికెన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739333859441_367-normal-WIFI.webp)
ఏపీలో బర్డ్ ఫ్లూతో లక్షలాది సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ప్రారంభమైంది. ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో సాధారణంగా రోజుకు 6 లక్షల కేజీల చికెన్ అమ్ముడవుతుంది. కానీ ఇప్పుడు 50 శాతం అమ్మకాలు పడిపోయాయి. దీంతో కేజీ చికెన్ రేటు రూ.150కి పడిపోయింది. ఏపీలోని తూ.గో., ప.గో., కృష్ణా జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో భారీగా కోళ్లు చనిపోతున్నాయి.
News February 12, 2025
బి.కొత్తకోట: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739330236163_52025345-normal-WIFI.webp)
భార్య కాపురానికి రాలేదని విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు. బి.కొత్తకోటకు చెందిన పోతుగాల్ల శేఖర్ (35) భార్య గంగాదేవి అలిగి పుట్టినిల్లు, పాత మొలకలచెరువుకు వచ్చేసిందన్నారు. భార్యను కాపురానికి రావాలని ఈనెల 8న వెళ్లి పిలవడంతో ఆమె నిరాకరించడంతో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడని ఎస్సై తెలిపారు. అతన్ని మదనపల్లి నుంచి తిరుపతి రుయాకు తరలించగా మృతి చెందాడు.