News May 26, 2024

తణుకులో ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు

image

ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తణుకు పట్టణంలో ఆదివారం జరిగింది. స్థానిక ఎన్టీఆర్‌ పార్కు సమీపంలో నివాసం ఉంటున్న చదలవాడ తిమోతి స్థానికంగా ఉంటున్న ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత బాలిక విషయాన్ని ఇంట్లో చెప్పడంతో తిమోతీని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 22, 2026

భీమవరం: అనంత బాబు కేసులో ఉన్నతాధికారి సస్పెండ్

image

కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన MLC అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పట్లో డీఎస్పీగా ఉండి, నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోలేదన్న ఆరోపణలపై ప్రస్తుతం ప.గో.జిల్లా ఏఎస్పీగా ఉన్న భీమరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

News February 22, 2026

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు: కలెక్టర్

image

ఆకివీడు మండలం దుంపగడప వి.వి.గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఆమె సూచించారు. గత ఏడాది డిగ్రీ ఫైనల్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని శోభారాణికి రూ.3 వేల నగదు బహుమతిని కలెక్టర్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె. సుజాత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.