News January 29, 2025

తణుకు: అమ్మమ్మ పాడె మోసిన నటుడు రానా

image

తణుకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి భార్య యలమర్తి రాజేశ్వరిదేవి అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు దగ్గుపాటి రానాకు రాజేశ్వరిదేవి స్వయానా అమ్మమ్మ. అంత్యక్రియల్లో రానా రాజేశ్వరిదేవి పాడెను మోసారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరిదేవి అల్లుడు దగ్గుబాటి సురేశ్‌తో పాటు ఆయన కుమారుడు దగ్గుబాటి రామానాయుడు (జూనియర్), ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

Similar News

News December 26, 2025

సంగారెడ్డి జిల్లాలో 85 స్కూల్ కాంప్లెక్స్‌లకు కంప్యూటర్లు: డీఈఓ

image

సంగారెడ్డి జిల్లాలోని 85 స్కూల్ కాంప్లెక్స్‌లకు విద్యాశాఖ ఆధ్వర్యంలో కంప్యూటర్లను పంపిణీ చేసినట్లు డీఈఓ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా వీటిని అందజేసినట్లు పేర్కొన్నారు. యూ-డైస్ డేటా నమోదు, మధ్యాహ్న భోజన పథకం వివరాల అప్‌లోడింగ్ వంటి కీలక విద్యా పనుల నిర్వహణకు ఈ కంప్యూటర్లు ఎంతగానో దోహదపడతాయని ఆయన వివరించారు. దీనివల్ల సమాచార సేకరణ మరింత సులభతరం కానుందని వెల్లడించారు.

News December 26, 2025

VZM: ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

image

కొత్తవలస జంక్షన్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. నిమ్మలపాలెం గ్రామానికి చెందిన ఎస్.పెదరామయ్య (55) కొత్తవలస, ఎస్.కోట రహదారిలో బస్టాప్ వద్ద నుంచి తన గ్రామానికి వెళ్లేందుకు నిలబడ్డాడు. అదే సమయంలో బస్సు రావడంతో ఇటీవల రైల్వే వారు తీసిన కాలవ గట్టు నుంచి జారిపోవడంతో బస్సు చక్రాల కింద పడి మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 26, 2025

జాతకం లేకపోతే ఎలా?

image

జాతకం లేకపోయినా కొన్ని శక్తివంతమైన పారాయణల దోషాలను అడ్డుకుంటాయి. ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం, ఆర్థిక కష్టాలకు విష్ణు సహస్రనామం, అప్పుల విముక్తికి అంగారక స్తోత్రం పఠించాలి. వివాహ ప్రాప్తికి రుక్మిణి కల్యాణం, సంతానం కోసం సంతాన గోపాల వ్రతం పనిచేస్తాయి. నిత్యం హనుమాన్ చాలీసా పఠిస్తే సకల విజయాలు కలుగుతాయి. గాయత్రీ మంత్రం జపించడం, దానాలు చేయడం జాతక దోషాలను తొలగించి శుభ ఫలితాలను ఇస్తాయని శాస్త్ర వచనం.