News August 14, 2025
తణుకు: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

తణుకులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు వార్డులను సందర్శించిన ఆమె రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పలు విభాగాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వైద్యుల కొరతను అడిగి తెలుసుకున్న ఆమె సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కిరణ్, ఆర్ఎంవో డాక్టర్ తాతారావు పాల్గొన్నారు.
Similar News
News August 14, 2025
మావుళ్లమ్మ ఆలయ ధర్మకర్తల మండలికి నోటిఫికేషన్

భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి దేవాదాయ శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. హిందూ మతానికి చెందిన 13 మందిని ధర్మకర్తలుగా నియమిస్తారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలయం వద్ద దరఖాస్తులను పొందవచ్చని ఆయన తెలిపారు.
News August 14, 2025
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం: కలెక్టర్

వసతి గృహాల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. తణుకులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు వసతి గృహంలోకి చేరిన నీటిని పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం ఉపేక్షించబోమని, ఏ సమస్య ఉన్నా వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
News August 14, 2025
అత్తిలి: నీట మునిగిన పొలాలను పరిశీలించిన కలెక్టర్

అత్తిలి మండలం తిరుపతిపురం, వరిగేడు గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షం తగ్గడంతో నీరు తొలగిపోతే పంటకు ఎలాంటి నష్టం ఉండదని కలెక్టర్ అన్నారు. సుమారు 400 నుంచి 500 ఎకరాల పంట ముంపునకు గురైనట్లు అధికారులు అంచనా వేశారు.