News February 12, 2025

తణుకు: బర్డ్‌ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలు ఇవే…!

image

బర్డ్‌ ఫ్లూ వైరస్‌ సోకిన తణుకు మండలం వేల్పూరులో కోళ్లఫారం నుంచి 10 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఇన్‌ఫెక్టెడ్‌ ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. తణుకు మండలంలోని తణుకుతోపాటు కొమరవరం, యర్రాయిచెరువు, మండపాక, తేతలి, ఇరగవరం మండలం ఇరగవరం, కావలిపురం, రేలంగి, అర్జునుడుపాలెం, అత్తిలి మండలంలో గుమ్మంపాడు, పాలి, బల్లిపాడు, పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామాలను ప్రకటించారు. చికెన్, గుడ్లు అమ్మకాలను నిలిపివేశారు.

Similar News

News February 12, 2025

యలమంచిలి : కళాశాల హాస్టల్లో విద్యార్థి సూసైడ్

image

ప.గో జిల్లా యలమంచిలికి చెందిన రావూరి సాయిరాం (22) కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల హాస్టల్లో సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్వగ్రామం బాడవకు తీసుకొచ్చారు. అయితే అతని మృతికి కారణాలు తెలియలేదని కాకినాడ పోలీసులు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ప్రాక్టికల్స్ ఉండడంతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా.. వేరే కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో కాకినాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 12, 2025

 ఓఎన్‌జీసి ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

image

దేశాభివృద్ధికి చమురు గ్యాస్ ఉత్పత్తులను వెలికి తీయడం ఎంత ముఖ్యమో, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలకు ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవడం అంతే ముఖ్యమని కలెక్టర్ నాగరాణి ఓఎన్జీసి ప్రతినిధులకు సూచించారు. మంగళవారం నాగిడిపాలెం తుఫాను పునరావాస కేంద్రం ఖాళీ ప్రదేశంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

News February 11, 2025

వేల్పూరులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ: జిల్లా కలెక్టర్

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుండడంతో జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తణుకు మండలం వేల్పూరులోని కృష్ణానంద పౌల్ట్రీ ఫామ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు చెప్పారు. వేల్పూరు నుంచి పది కిలోమీటర్ల వరకు అలర్ట్ జోన్ ప్రకటించారు. చికెన్, కోడిగుడ్లు అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. అన్ని షాపులను మూసివేయాలని సూచించారు.

error: Content is protected !!