News August 12, 2024

తణుకు: బైకు అదుపుతప్పి యువకుడు దుర్మరణం

image

బైక్ అదుపుతప్పి ఓ యువకుడు మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి తణుకు పట్టణంలో జరిగింది. ఉండ్రాజువరం జంక్షన్ సమీపంలో జరుగుతున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా ట్రాఫిక్ మళ్లించేందుకు రోడ్డుకు అడ్డంగా తాడు కట్టారు. అటుగా బైక్‌పై వెళ్తున్న పాలంగికి చెందిన గంగులకుర్తి పూర్ణచంద్ర సాయికుమార్ (22) తాడును గమనించకపోవడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలవడంతో మృతి చెందాడు. కేసు నమోదైంది.

Similar News

News September 30, 2024

విషాదం.. 18వ అంతస్తు నుంచి దూకి తల్లీకూతుళ్ల సూసైడ్

image

భీమవరంలో విషాదం నెలకొంది. 3ఏళ్ల కుమార్తెతో కలిసి 18వ అంతస్తు నుంచి దూకి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన మానస(30) భర్త, కూతురు కృషితో కలిసి HYDలోని నార్సింగి సమీపంలో నివాసం ఉంటోంది. భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆదివారం రాత్రి మానస కూతురితో కలిసి బిల్డింగ్‌ పైనుంచి దూకేసింది. అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 30, 2024

బాగా చదవాలన్నందుకు కాలువలో దూకిన విద్యార్థి

image

బాగా చదివి పదో తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెప్పినందుకు ఓ విద్యార్థి కాలువలో దూకేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారావుకు కుమారుడు పోలినాయుడు(16), కుమార్తె సంతానం. ఆదివారం కుమార్తె పుట్టిన రోజు వేడుకలను పెద్దింటమ్మ ఆలయం వద్ద నిర్వహించారు. ఈ క్రమంలో పేరెంట్స్, బంధువులు ‘పది’లో మంచి మార్కులు తెచ్చుకోవాలని పోలినాయుడితో అనగా.. మనస్తాపానికి గురై వెళ్లి కాలువలో దూకేశాడు.

News September 29, 2024

జగన్‌కు పరిపాలన చేయడం రాదు: మంత్రి నారాయణ

image

ఏపీ మాజీ సీఎం జగన్‌కు పరిపాలన చేయడం రాదని మంత్రి నారాయణ అన్నారు. పాలకొల్లు టిడ్కో ఇళ్ల వద్ద మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లకు పూర్వవైభవం తెస్తామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చైనా పర్వాలేదని సీఎం చంద్రబాబు అన్నారని చెప్పారు. పాలకొల్లులోని ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.