News January 6, 2026
తత్కాల్ టికెట్ బుకింగ్ టిప్.. ఈ ఫీచర్‌తో పని ఈజీ!

IRCTCలో తత్కాల్ టికెట్ త్వరగా బుక్ అవ్వాలంటే Master List ఫీచర్ వాడొచ్చు. ‘My Profile’లో ప్రయాణికుల పేర్లు, వయసు, ఆధార్ వివరాలను ముందే సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల బుకింగ్ టైమ్‌లో మళ్లీ టైప్ చేసే పని ఉండదు. కేవలం ఒక్క క్లిక్‌తో ప్యాసింజర్ డీటెయిల్స్ యాడ్ అవుతాయి. టైమ్ ఆదా అవ్వడమే కాకుండా తత్కాల్ సీటు దొరికే ఛాన్స్ పెరుగుతుంది. గరిష్ఠంగా 12 మంది వివరాలను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.
Similar News
News February 14, 2026
ఉల్లి.. రూ.100కే 6 కేజీలు

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో రూ.100కే 6 కేజీలు విక్రయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.20కి అమ్ముతున్నారు. టమాటా రేట్లు కూడా పడిపోయాయి. కేజీ రూ.10-15 పలుకుతోంది. వంకాయ కేజీ రూ.25-30కే లభిస్తోంది. దొండకాయ రూ.50, పచ్చిమిర్చి రూ.50, క్యాప్సికం రూ.45కు విక్రయిస్తున్నారు.
News February 14, 2026
గురుపత్వంత్ హత్యకు కుట్ర.. అంగీకరించిన ఇండియన్

ఖలీస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ హత్యకు యూఎస్‌లో కుట్ర పన్నినట్లు ఇండియన్ నిఖిల్ గుప్తా US కోర్టులో అంగీకరించాడు. దీంతో అతనిపై హత్యకు కుట్ర, మనీలాండరింగ్, కిరాయి హత్య <<14361092>>అభియోగాలు<<>> మోపారు. గరిష్ఠంగా 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. అయితే 21-25 ఏళ్లకు శిక్షను తగ్గించాలని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు సిఫార్సు చేయడం గమనార్హం. మే 29న శిక్ష ఖరారు చేయనున్నారు.
News February 14, 2026
విటమిన్స్ లోపం-లక్షణాలు

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయట పడుతూ ఉంటుంది. నోటి చివర్లలో పగుళ్లు ఏర్పడుతుంటే జింక్, ఐరన్, B విటమిన్లు (నయాసిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ B12) లోపం. చర్మంపై రాషెస్‌తో పాటు, వెంట్రుకలు రాలుతూ ఉంటే బయోటిన్ (విటమిన్ B7) లోపం. చేతులు, పాదాల్లో చురుక్కుమనడం, తిమ్మిర్లుంటే ఫోలేట్, B6, B12 లోపముందని గుర్తించాలి. కాళ్లలో పోట్లు ఉంటే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం లోపమని గుర్తించాలి.


