News May 14, 2024
తనకు తాను ఓటేసుకోని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
మాడుగుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి తను పోటీ చేసిన మాడుగుల నియోజకవర్గంలో ఓటు వేయడానికి అవకాశం లేకపోయింది. పెందుర్తి నియోజకవర్గం పరిధిలో తన స్వగ్రామమైన వెన్నెలపాలెంలో తన సతీమణితో కలిసి ఓటు వేశారు. ఆఖరి నిమిషంలో మాడుగుల నియోజకవర్గం టీడీపీ టికెట్ ఖరారవ్వడంతో ఆయన ఓటును మార్చుకునే అవకాశం లేకపోయింది. కాగా.. కూటమి తరఫున పెందుర్తిలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్ పోటీలో ఉన్నారు.
Similar News
News January 23, 2025
విశాఖ-దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు కోచ్‌లు కుదింపు
విశాఖ-దుర్గ్ వందేభారత్ (20829/30) ఎక్స్‌ప్రెస్‌కు కోచ్‌లు కుదించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఇప్పటివరకు ఈ రైలు 16 కోచ్‌లతో నడిచేది. అయితే జనవరి 24వ తేదీ నుంచి 8 కోచ్‌లతో మాత్రమే నడుస్తుందని ఆయన తెలిపారు. అందులో ఒక ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్, ఏడు ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News January 23, 2025
విశాఖ: పుట్టినరోజు నాడే కానిస్టేబుల్ అభ్యర్థి మృతి
విశాఖ ఏఆర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలో గురువారం ఉదయం అపశ్రుతి చోటుచేసుకుంది.1,600 మీటర్ల రన్నింగ్ అనంతరం సొమ్మసిల్లి పడిపోయిన శ్రవణ్ కుమార్‌ను నిర్వాహక సిబ్బంది ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టినరోజు నాడే శ్రవణ్ కుమార్ మృతి చెందటం పట్ల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీస్ అవుతాడానుకుంటే అందరాని దూరాలకు వెళ్లిపోయాడని విలపిస్తున్నారు.
News January 23, 2025
మోడల్ సిటీగా విశాఖను తీర్చిదిద్దాలి: ఆమ్రపాలి
విశాఖ మహానగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. గురువారం వీఎంఆర్డీఏలో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. డీపీఆర్‌లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు.