News October 5, 2025

తనిఖీలు చేపట్టిన కడప జిల్లా ఎక్సైజ్ అధికారులు

image

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ ఘటన నేపథ్యంలో కడప జిల్లా ఎక్సైజ్ అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లలో మద్యం లేబుళ్లను తనిఖీ చేశారు. మద్యం బాటిళ్ల మూతలను, సీళ్లను పరిశీలించారు. ప్రొద్దుటూరులోని మద్యం దుకాణాల్లో మద్యం లేబుళ్లను పరిశీలించినట్లు ఎక్సైజ్ సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో నకిలీ మద్యం లేదని జిల్లా ES రవికుమార్ స్పష్టం చేశారు.

Similar News

News October 6, 2025

జిల్లా ఎస్పీ ఆదేశాలతో విజిబుల్ పోలీసింగ్

image

కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం జిల్లా ఎస్పీ ఆదేశాలతో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రజల భద్రత కోసం వాహనాల తనిఖీలు, సైబర్ నేరాలపై అవగాహన, రహదారి భద్రత నిబంధనల అమలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఏవైనా భద్రత సమస్యలు ఎదుర్కొంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News October 4, 2025

కడప: కన్ఫ్యూజన్‌లో ఆ 2 నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు

image

కడప జిల్లాలోని ఆ 2 నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. జమ్మలమడుగు, బద్వేల్‌లో ఇద్దరిద్దరు నేతలు సమన్వయకర్తలుగా ఉండటంతో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక కార్యకర్తలు సందిగ్ధంలో పడుతున్నారు. జమ్మలమడుగులో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య, బద్వేల్‌లో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డిల మధ్య ఇన్‌ఛార్జ్ పదవి కోసం పోరు సాగుతోంది.

News October 4, 2025

రేపు కడప జిల్లాకు రానున్న మంత్రి సవిత

image

కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత శనివారం కమలాపురం రానున్నట్టు టీడీపీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. కూటమి ప్రభుత్వం శనివారం ఆటో డ్రైవర్లకు 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందచేయనుంది. కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆమె రానున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి. ఎమ్మెల్యే చైతన్య రెడ్డి పాల్గొననున్నారు.