News August 31, 2025

తప్పుడు ప్రకటనలు మానుకోండి: ధర్మాన

image

ప్రజా సమస్యలను వదిలేసి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. మబుగాం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రుషికొండ భవనాలపై చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు తీసి వారి కడుపు కొట్టొద్దని సూచించారు.

Similar News

News August 31, 2025

కలగా మిగిలిన వంశధార-బాహుదా నదుల అనుసంధానం

image

శ్రీకాకుళం జిల్లాలో వంశధార, బాహుదా నదుల అనుసంధానం కలగానే మిగిలింది. గొట్టాబ్యారేజీ నుంచి నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. వంశధార నది నుంచి సుమారు 97,262 టీఎంసీలు బాహుదాకు మళ్లించాలని గతంలో TDP ప్రభుత్వ హయాంలో సంకల్పించారు. ఈ రెండు నదులు అనుసంధానం చేస్తే ఎనిమిది మండలాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కూటమి ప్రభుత్వం స్పందించి వంశధార, బాహుదా నదుల అనుసంధానం వెంటనే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News August 31, 2025

శ్రీకాకుళం: రేపు కలెక్టర్ గ్రీవెన్స్

image

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 31, 2025

టెక్కలి జిల్లా ఆసుపత్రిని వేధిస్తున్న సమస్యలు

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో రేడియాలజీ, చర్మవ్యాధులు, జనరల్ సర్జిన్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రికి స్టాఫ్ నర్సులు, జీడీఏలు కొరత అధికంగా వేధిస్తోంది. రోగులకు తాగునీరు కోసం ఏర్పాటు చేసిన ఆర్.ఓ ప్లాంట్ తరుచూ మరమ్మతులకు గురౌతుంది. డ్రైనేజీ సమస్యతో పాటు ప్రధానంగా బయోమెడికల్ వేస్ట్ భద్రపరిచేందుకు గదిలేదు. ఆసుపత్రిలో ఇంకేమైనా ప్రధాన సమస్యలు ఉన్నాయా ? అయితే COMMENT చేయండి.