News January 3, 2026
తప్పుల్లేని ఓటర్ల జాబితాను రూపొందించాలి: కలెక్టర్

ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. బీఎల్ఓలు ప్రతిరోజూ 30 నుంచి 40 ఎంట్రీలు చేస్తూ, ఇంటింటి సర్వే ద్వారా తప్పుల్లేని జాబితా సిద్ధం చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
ఘోర ఓటమి.. అర్ధరాత్రి పాక్ కీలక నిర్ణయం!

T20WC: భారత్ చేతిలో ఘోర ఓటమి పాలైన పాకిస్థాన్ జట్టులో ప్రకంపనలు మొదలయ్యాయి. టీమ్ ప్రదర్శనపై మేనేజ్‌మెంట్ ఆగ్రహంతో ఉన్నట్లు PCB అధికారి ఒకరు వెల్లడించారు. ఓటమి తర్వాత అర్ధరాత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సీనియర్ ఆటగాళ్లైన బాబర్, షాహీన్ అఫ్రీదిపై వేటు వేయనున్నట్లు పేర్కొన్నారు. వారి స్థానాల్లో సల్మాన్ మీర్జా, నసీమ్, ఫకర్, ఖవాజా పేర్లను నమీబియాతో మ్యాచ్‌కు పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
News February 16, 2026
విజయనగరం కలెక్టరేట్‌కు 259 వినతులు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 259 వినతులు అందాయి. వీటిలో 166 పీజీఆర్ఎస్‌కు, 93 రెవెన్యూ క్లినిక్‌కు వచ్చాయి. డీఆర్ఓ మురళి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, కళావతి, నూకరాజు, బి. శాంతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News February 16, 2026
కాంగ్రెస్ ఖాతాలోకి 82 ఛైర్మన్, 5 మేయర్ పోస్టులు

TG: మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఛైర్మన్/మేయర్, వైస్ ఛైర్మన్/ డిప్యూటీ మేయర్ ఎన్నికల ఫలితాలను SEC అధికారికంగా ప్రకటించింది. INC 82 ఛైర్మన్, 5 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. BRS 18 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలు సాధించింది. BJP, AIFBలకు చెరొకటి, ఇండిపెండెంట్లకు 3 ఛైర్మన్ స్థానాలు దక్కాయి. కార్పొరేషన్లలో కొత్తగూడెం CPI, కరీంనగర్ BJP ఖాతాలో చేరాయి. 11 చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది.


