News February 20, 2025

తమిళనాడు మంత్రికి స్వాగతం పలికిన TG మంత్రి

image

తమిళనాడు హ్యాండ్లూమ్స్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌కి వచ్చిన తమిళనాడు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ శాఖ మంత్రి తిరు ఆర్.గాంధీని HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయనకి మంత్రి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి కీలక విషయాలపై చర్చించారు.

Similar News

News February 20, 2026

HYD: మోగనున్న పెళ్లి బాజాలు.. వాటికి ఫుల్ డిమాండ్

image

డిసెంబర్ నుంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలు నిలిచిపోయాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను చాలావరకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈనెల 17తో శుక్రమౌఢ్యమి అమావాస్య ముగిసింది. దీంతో HYD, ఉమ్మడి రంగారెడ్డిలోని ఫంక్షన్ హాళ్లు, వివాహాలకు సంబంధించి కొనుగోళ్లతో వస్త్ర, బంగారు దుకాణాలలో రద్దీ పెరిగింది. ముహూర్తాలు మొదలు కావడంతో డెకరేషన్, ఫొటోగ్రఫి, ఈవెంట్లు నిర్వాహకులు తీరిక లేకుండా ఉన్నారు.

News February 20, 2026

HYD: 60% వరకు రాయితీతో బైకులు

image

PM మత్స్య సంపద యోజన కింద HYD జిల్లాలో అర్హతగల మత్స్యకారులకు 16 బైకులు (ఐస్ బాక్స్‌తో) మంజూరు చేసినట్లు జిల్లా మత్స్యశాఖాధికారి రజిని తెలిపారు. ఒక్క యూనిట్ విలువ రూ.75,000 అని స్పష్టంచేశారు. జనరల్‌, SC/STలకు 40% (రూ.30వేలు), మహిళలకు 60% (రూ.45వేలు) రాయితీ ఉంటుంది. చేపల అమ్మకంలో అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఆసక్తిగల వారు ఫిబ్రవరి 26లోగా మాసబ్‌ట్యాంక్‌ మత్స్యభవన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

News February 20, 2026

రంజాన్ మాసంలో చార్మినార్‌కు కొత్త అందాలు

image

రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో షాపింగ్ స్టాల్స్ సందడిగా మారాయి. హోల్ సేల్ వస్త్రాల మార్కెట్‌గా పేరుగాంచిన మదీనాతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలల్లో దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో షాపులకు రద్దీ పెరిగింది. చార్మినార్‌ను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు.