News April 2, 2025

తలంబ్రాల బుకింగ్‌లో ఉమ్మడి కరీంనగర్ రికార్డు

image

రాములవారి కళ్యాణ తలంబ్రాల బుకింగ్‌లో KNR రీజియన్ దూసుకుపోతోందని ఆర్టీసీ లాజిస్టిక్స్ ఏటీఎం రామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6000 రాములోరి కళ్యాణ ముత్యాల తలంబ్రాలు బుకింగ్ అయినట్లు తెలిపారు. సీతారాముల వారి కళ్యాణానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News February 26, 2026

MBNR: పాలమూరు యూనివర్సిటీ.. ఫలితాలు విడుదల

image

MBNR జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీలో 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ VII-సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ఫలితాలను వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు విడుదల చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 69.39% ఉత్తీర్ణత నమోదైంది. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే.ప్రవీణ, డాక్టర్ ఎన్.చంద్ర కిరణ్ పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అధికారులు సూచించారు.

News February 26, 2026

మాతా-శిశు మరణాలను అరికట్టాలి: కలెక్టర్

image

మాతా-శిశు మరణాలను అరికట్టేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. స్వస్థ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రక్తహీనతతో హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పౌష్టికాహారంపై అవగాహన పెంపొందించాలని చెప్పారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

News February 26, 2026

నిజామాబాద్: రూ.151 కే భద్రాచలం తలంబ్రాలు

image

భద్రాచలంలో మార్చి 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేస్తామని నిజామాబాద్ ఆర్ఎం జోత్స్న తెలిపారు. సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల భక్తులు కేవలం రూ.151 చెల్లించి ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవచ్చన్నారు. రాములోరి కళ్యాణానికి వెళ్లలేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.