News April 2, 2025
తలంబ్రాల బుకింగ్‌లో కరీంనగర్ రికార్డు

రాములవారి కళ్యాణ తలంబ్రాల బుకింగ్‌లో KNR రీజియన్ దూసుకుపోతోందని ఆర్టీసీ లాజిస్టిక్స్ ఏటీఎం రామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6000 రాములోరి కళ్యాణ ముత్యాల తలంబ్రాలు బుకింగ్ అయినట్లు తెలిపారు. సీతారాముల వారి కళ్యాణానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News December 12, 2025
రాజమండ్రి: పెట్రోల్ దొంగతనం చేస్తున్నాడని హత్య.. జైలు

కడియానికి చెందిన రాయ వెంకన్న, నల్లి శేఖర్‌లకు 7 సం.లు జైలు శిక్ష, రూ. 5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2018 సెప్టెంబర్లో కడియం (M) M. R పాలేనికి చెందిన శీలం సంతోశ్ (13) మోటారు సైకిళ్లలో పెట్రోల్ చోరీ చేస్తున్నాడనే నెపంతో వెంకన్న, శేఖర్ కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదయింది. దీనిపై జిల్లా జడ్జి గంధం సునీత శిక్ష ఖరారు చేశారు.
News December 12, 2025
SKLM: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి గురువారం ప్రకటనలో తెలిపారు.ఇంధన పొదుపు ఆవశ్యకతను వినియోగదారులకు మరింత తెలిసేలా అవగాహన కల్పించేలా నిర్వహిస్తామన్నారు. ఈ వారోత్సవాలను శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ కేంద్రాల్లో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News December 12, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ ఎంట్రీ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీలను బీజేపీ కైవసం చేసుకొని సత్తాచాటింది. జిల్లాలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి సీన్ మారింది. గ్రామాల్లో సైతం కమలం పార్టీ పుంజుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 22 గ్రామ పంచాయతీలను బీజేపీ సొంతం చేసుకుంది. వరంగల్ జిల్లాలో 3, హనుమకొండలో 10, జనగామలో 1, మహబూబాబాద్‌లో 5, భూపాలపల్లిలో 3, ములుగులో మాత్రం ఖాతా తెరవలేదు.


