News August 24, 2025

తలకొండపల్లి: డబ్బులు కాజేసిన నిందితుల అరెస్ట్

image

తలకొండపల్లిలో శుక్రవారం నకిలీ మెసేజ్ చూపించి కిరాణా దుకాణం నుంచి రూ.2,000 కాజేసిన ముగ్గురు నిందితులను శనివారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. నిందితులు చుక్కాపూర్ గ్రామానికి చెందిన మహేశ్, నాని, ఆమనగల్లుకు చెందిన పవన్ అని తెలిపారు. వీరు కొన్ని రోజులుగా గూగుల్ పేలో ఫేక్ ట్రాన్సాక్షన్ చూపించి, కిరాణా దుకాణాల యజమానులను మోసం చేసినట్లు వివరించారు.

Similar News

News September 2, 2025

లండన్‌లో యాక్సిడెంట్.. HYD వాసులు మృతి

image

లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.

News September 2, 2025

HYD: నేరాలు నివారించడానికి నిఘా: సీపీ

image

ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మధురానగర్ PSలో గణేశ్ నిమజ్జన బందోబస్తుపై పోలీసులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు, పిక్ పాకెటింగ్, ఈవ్ టీజింగ్, గొలుసు దొంగతనం తదితర నేరాలు నివారించడానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలన్నారు.

News September 2, 2025

HYD: గణేశ్ నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు

image

గణేశ్ నిమజ్జనానికి GHMC ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం కమిషనర్ కర్ణన్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, లేక్ వ్యూ పార్క్, బతుకమ్మ కుంట తదితర ప్రాంతాలను పరిశీలించారు. బారీకేడింగ్, లైటింగ్, క్రేన్లు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరంలోని 20 ప్రధాన చెరువులతో పాటు చిన్న విగ్రహాల కోసం 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశామన్నారు.