News November 19, 2024

తలమడుగు : క్యాన్సర్‌తో పదోతరగతి బాలుడి మృతి

image

క్యాన్సర్ వ్యాధితో పదోతరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన పులనేని గంగయ్య-కవిత దంపతుల కుమారుడు చరణ్ స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. కాగా విద్యార్థి గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ బాలుడు మంగళవారం మృతిచెందాడు. చిన్నవయసులోనే అనారోగ్యంతో మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News January 29, 2025

ఇచ్చోడ: అప్పు తీర్చలేనని పురుగుమందు తాగి ఆత్మహత్య

image

పురుగుమందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. SI తెలిపిన వివరాల ప్రకారం.. బోరిగామకు చెందిన బోల్లి రాజు(40) గ్రామ సంఘం నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నారు. అప్పు కట్టాల్సిన తేదీ రావడంతో తీసుకున్న డబ్బులు ఎలా తీర్చాలని మనస్తాపం చెందారు.  దీంతో గ్రామ సమీపంలోని పత్తి చేనులో పురుగుమందు తాగి మృతి చెందినట్లు SI తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News January 28, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధరల వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,950గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.110తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

News January 28, 2025

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: ఖానాపూర్ ఎమ్మెల్యే

image

ఉమ్మడి జిల్లాకు అత్యధికంగా నిధులను మంజూరు చేయించి అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. సోమవారం సిరికొండ మండలంలోని వాయిపెట్ గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వాలీబాల్ పోటీలను తిలకించి, ఆటను ఆడారు. మాజీ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు.