News November 3, 2024

తలమడుగు: పసివాడి పాలకోసం.. ఆవు, దూడను అందజేసిన సీఐ

image

తలమడుగు మండలం పల్లి (బి) గ్రామానికి చెందిన రేణుకా అనే మహిళ ఇటీవల బాబుకు జన్మనిచ్చి అనారోగ్యంతో మృతి చెందింది. కాగా ఆ బాబు పాల కోసం అవస్థలు పడుతుండడంతో కొందరు వ్యక్తులతో ఈ విషయాన్ని తెలుసుకొని ఇచ్చోడ మండల సమీపంలోని శ్రీ జై శ్రీరామ్ గోశాలకు వెళ్ళగా.. సీఐ భీమేష్ చేతుల మీదుగా బాబు తండ్రి మారుతికి ఆవు, దూడను అందజేశారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వహకులు ఐదా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 25, 2024

చెన్నూర్: మాలలు ఐక్యంగా ఉద్యమించాలి: ఎమ్మెల్యే వివేక్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఆదివారం జరిగిన మాలల మహా గర్జన సభకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా మాలలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

News November 24, 2024

జన్నారం: అటవీ క్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్య అటవీ క్షేత్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఆదివారం సాయంత్రం ఆయన జన్నారం మండలంలోని గోండుగూడా అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా అడవి, వన్యప్రాణుల రక్షణకు అటవీ అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. అలాగే అటవీ అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

News November 24, 2024

నిర్మల్‌: రేపటి నుంచి ప్రజా ఫిర్యాదుల విభాగం

image

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రేపటి నుంచి యథావిధిగా ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గ్రహించి తమ అర్జీలను అధికారులకు సమర్పించుకోవచ్చని సూచించారు.