News November 19, 2025

తలసానిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్.. మామ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తలసానికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను తలసాని ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.

Similar News

News April 11, 2026

ఆటిజం పిల్లల వికాసానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

ఆటిజమ్‌తో బాధపడే పిల్లలకు విద్య, వైద్యంతో పాటు జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మున్సిపల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేస్తున్న సమగ్ర ఆటిజమ్ సపోర్ట్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. పిల్లల మేధాశక్తి పెంపు కోసం సరైన వాతావరణం, పరికరాలు ఉండాలని సూచించారు. తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని తెలిపారు. అధికారులు పాల్గొన్నారు.

News April 11, 2026

మూల్యాంకనంలో చిన్న పొరపాటు కూడా జరగకూడదు: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శనివారం సందర్శించారు. కేంద్రంలో ఉపాధ్యాయులకు కల్పించిన మౌలిక వసతులపై డీఈవో కృష్ణప్పను అడిగి తెలుసుకున్నారు. అక్కడి ఏర్పాట్లపై ఉపాధ్యాయులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. మూల్యాంకనంలో చిన్న పొరపాటు కూడా జరగకూడదని సూచించారు.

News April 11, 2026

సామాన్య భక్తుల దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం: హోంమంత్రి

image

సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లపై మంత్రులు అనిత, బాలవీరాంజనేయస్వామి, ఆనం రామనారాయణ రెడ్డి శనివారం విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా నిర్వహించారు. గత అనుభూవాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు ముందుకు వెళ్లాలని సూచించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా
ఉండాలన్నారు. సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని హోం మంత్రి అనిత అన్నారు.