News July 5, 2025

తల్లిదండ్రులకు విద్యార్థినుల అప్పగింత

image

తుని మండలం గవరయ్య కోనేరు వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల హాస్టల్ నుంచి ముగ్గురు విద్యార్థునులు తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు వీరిని హైవే రోడ్డుపై గురించి వారి తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపల్‌కు సమాచారం అందించారు. అనంతరం విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.

Similar News

News July 5, 2025

రోజుకు 10 గంటలు పని చేసేందుకు అనుమతి

image

TG: వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగులు రోజుకు 10 గంటల వరకు పనిచేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం GO జారీ చేసింది. వారంలో పనివేళలు 48 గంటలకు మించరాదని <>ఉత్తర్వుల్లో <<>>స్పష్టం చేసింది. ఒకవేళ 48 గంటలు దాటితే ఓటీ చెల్లించాలని, రోజులో 6 గంటల్లో కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాలని పేర్కొంది. విశ్రాంతితో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదని వెల్లడించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా పనివేళలు సవరించామని వివరించింది.

News July 5, 2025

విశాఖ: 100% సబ్సిడీతో ట్రాన్స్‌పాండర్లు

image

విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చెందిన బోట్లకు ట్రాన్స్పాండర్లను ప్రభుత్వం అందజేసింది. 634 బోట్లకు 100% సబ్సిడీతో వీటిని సమకూర్చారు. వీటి ద్వారా సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను పర్యవేక్షించవచ్చు. సముద్రంలో బోట్లు ఉన్న స్థానాన్ని తెలుసుకోవచ్చు. వర్షాకాలం కావడంతో తుఫానులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటి ఉపయోగం ఎంతో ఉందని బోట్ల యజమానులు తెలిపారు.

News July 5, 2025

డొంకేశ్వర్ మండలం నుంచి 41 మంది IIITకి ఎంపిక

image

డొంకేశ్వర్ మండలం నుంచి మొత్తం 40 మంది విద్యార్థులు IIITకి ఎంపికయ్యారు. ఇందులో డొంకేశ్వర్ ZPHSకు చెందిన 26 మంది విద్యార్థులు ఉండటం విశేషం. 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. తొండాకూర్ ZPHS నుంచి 9, నికాల్పూర్ ZPHS ఐదుగురు, గాదేపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు. డొంకేశ్వర్ పాఠశాల హెచ్ఎం సురేశ్, తొండాకూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.