News July 19, 2024
తల్లిని హత్య చేసిన కొడుకు రిమాండ్

కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని ఇటీవల తల్లి సక్రిని కర్రతో కొట్టి హత్య చేసిన కుమారుడు భీముడు ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్సై రాజారాం తెలిపారు. ఈనెల 15న కన్నతల్లి అయిన సక్రిని గుగులోత్ భీముడు కర్రతో కొట్టి హత్య చేశాడు. విచారణలో తల్లిని చంపిన వ్యక్తి బీముడు ను అదుపులో తీసుకొని రిమాండ్ చేసినట్లు ఎస్ఐ చెప్పారు.
Similar News
News August 20, 2025
మున్నేరుకు స్వల్పంగా పెరిగిన నీటిమట్టం

ఖమ్మం మున్నేరుకు వరద స్వల్పంగా పెరిగింది. సోమవారం 8 అడుగులకు తగ్గిన నీటిమట్టం, బుధవారం ఉదయం 10.50 అడుగులకు చేరింది. ప్రస్తుతం మున్నేరులో 30 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
News August 20, 2025
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

ఖమ్మం: సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 75 డెంగ్యూ కేసులు నమోదు కాగా, 52 కేసులు కోలుకున్నాయని, 23 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని చెప్పారు. పాజిటివ్ కేసులు వచ్చిన ఇళ్లు, పరిసర 60 ఇండ్లలో ఫీవర్ సర్వే, యాంటీ లార్వా చర్యలు చేపట్టాలన్నారు. లక్షణాలున్న వారికి వెంటనే పరీక్షలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
News August 20, 2025
నెలాఖరులోగా లక్ష్యాన్ని పూర్తి చేయండి: ఖమ్మం కలెక్టర్

వనమహోత్సవం కింద ఈ సంవత్సరం వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను నెలాఖరు లోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజతో కలిసి వనమహోత్సవం, సీజనల్ వ్యాధులు, ప్రభుత్వ కార్యాలయాల రూఫ్‌లపై సోలార్ ప్యానెళ్ల పురోగతిపై కలెక్టర్ సంబంధిత అధికారులు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీవోలతో సమీక్షించారు. అనంతరం పలు సూచనలు చేశారు.