News May 17, 2024
తల్లి మందలించిందని కుమారుడి ఆత్మహత్య

బేతంచెర్ల మండలం గోరుమానుకొండకు చెందిన సండ్రబోయిన వెంకటేశ్వర్లు, రాములమ్మ దంపతుల కుమారుడు వంశీ(22) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీ చెడు వ్యసనాలకు బానిసై బాధ్యత లేకుండా తిరుగుతుండటంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన వంశీ గ్రామ చివర్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాల పాలైన వంశీని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
Similar News
News February 20, 2026
పరిహారం త్వరితగతిన మంజూరు చేయాలి: జేసీ

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జేసీ నూరుల్ ఖమర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇంటి స్థలం, అర్హత కలిగిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 20, 2026
కర్నూలు: రెండు వారాల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

కర్నూలు(D) గోనెగండ్ల మండలం ఐరన్ బండకు చెందిన టీడీపీ కార్యకర్త, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ బోయ నీలకంఠ(30) నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు ఇటీవలే నిశ్చితార్థం అయింది. మార్చి 5, 6వ తేదీలలో వివాహం జరగాల్సి ఉండగా ఈ ఘటనతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యాయి. నీలకంఠ మృతి పట్ల టీడీపీ మండల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News February 20, 2026
నంద్యాల: గుండెపోటుతో కోవా బన్ను వ్యాపారి మృతి

నంద్యాల(D) ఆత్మకూరుకు చెందిన కోవా బన్ను వ్యాపారి షేక్ బాషా నిన్న గుండెపోటుతో మృతిచెందారు. మేడారం జాతర సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ చూపిన అత్యుత్సాహంతో అతని వ్యాపారం పడిపోయింది. ఈ వ్యాపారం కోసం ప్రత్యేకంగా గేదెలు, ఆటో కొనుగోలు చేయడంతో పాటు సుహానా-సమయ మిల్క్ డెయిరీ పేరుతో పాల ఉత్పత్తి చేసేవారు. వ్యాపారం ఆగిపోవడంతో అప్పులు తీర్చేమార్గం లేక వేదనకు గురై గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


