News April 15, 2025
తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ మనదే: KMR ప్రోగ్రాం అధికారి

కామారెడ్డిలోని రాజీవ్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డా.అనురాధ మంగళవారం సందర్శించారు. ల్యాబ్, ఫార్మసీ గదులను పరిశీలించారు. రిజిస్టర్లను, రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తల్లి, బిడ్డల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ఆరోగ్య సిబ్బందిదేనని ఆమె అన్నారు. ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలపై సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు.
Similar News
News November 20, 2025
రాజమౌళి సినిమాలు ఆపేస్తాం.. VHP వార్నింగ్

హనుమంతుడిపై వ్యాఖ్యలు చేసిన రాజమౌళి క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు ఆపేస్తామని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. రాముడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా అని VHP నేత తనికెళ్ల సత్యకుమార్ ప్రశ్నించారు. రాజమౌళి వ్యాఖ్యలను ధర్మ ద్రోహంగా భావిస్తామని, డబ్బు గర్వంతో మాట్లాడితే VHP క్షమించదని స్పష్టం చేశారు. కాగా రాజమౌళి కామెంట్స్‌ను ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు సైతం ఖండించారు.
News November 20, 2025
పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకూడదు: కలెక్టర్

గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలోని మంజీత్ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ & ప్రెసింగ్ యూనిట్‌లో సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఏ.సిరి పరిశీలించారు. రైతులతో మాట్లాడిన ఆమె.. పత్తి సేకరణ, కొలతలు, రేట్లపై సమాచారం తీసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సకాలంలో చెల్లింపులు చేయాలని సీసీఐ అధికారులను ఆదేశించారు.
News November 20, 2025
మేడ్చల్: ఘనంగా బాలల వారోత్సవాలు

అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రజావాణి ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు సరిత, రాధిక గుప్తా పాల్గొని పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. గౌరవంతో జీవించడం, విద్యను పొందడం, రక్షణ పొందడం ప్రాథమిక హక్కులని, ప్రతి చిన్నారి ఆత్మవిశ్వాసం, ఆనందం, సమానత్వం కలిగి ఉండాలన్నారు.


