News February 20, 2025

తవణంపల్లి MRO ఆఫీసులో JC విద్యాధరి తనిఖీలు 

image

తవణంపల్లి MRO ఆఫీసును బుధవారం జాయింట్ కలెక్టర్ విద్యాధరి పరిశీలించారు. ఈ మేరకు ఆమె ఆఫీసులోని రికార్డులను తనిఖీ చేశారు. భూముల రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతుల సమస్యలపై ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మార్వోకు సూచించారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు సకాలంలో అందుతున్నాయా అని ఆరా తీశారు. 

Similar News

News February 22, 2026

మండల స్థాయిలోనూ PGRS: కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మ. 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామన్నారు. Meekosam.ap.gov.inలోనూ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డయల్ 1100లో ఫిర్యాదు స్థితిని తెలుసుకోవచ్చు అన్నారు. ఇక నుంచి డివిజన్, మండల స్థాయిలోనూ PGRS నిర్వహిస్తామన్నారు.

News February 22, 2026

కుప్పం: బస్ పాస్, హాల్ టికెట్ చూపిస్తే RTC బస్సులో ఫ్రీ

image

ఇంటర్ పరీక్షలకు సంబంధించి బస్ పాస్ తోపాటు హాల్ టికెట్ చూపిస్తే RTC ఆర్డినరీ బస్సులో ఎగ్జామ్ సెంటర్ కు ఫ్రీగా ప్రయాణించవచ్చని కుప్పం RTC డిపో మేనేజర్ TK స్వామి తెలిపారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం పూట బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షల సమయంలో RTC బస్సులు నడుపుతామన్నారు. విద్యార్థినులు ఆధార్ కార్డు చూపించిన ఉచితంగా వెళ్లవచ్చునారు.

News February 22, 2026

చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.144 నుంచి రూ.150, మాంసం రూ.209 నుంచి 234 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.238 నుంచి రూ.260 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 75 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.