News July 5, 2025
తాండవ జలాశయం నుంచి సాగు నీరు అందజేత..!

తాండవ జలాశయం కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో 51,465 ఎకరాలకు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్నట్లు ప్రాజెక్ట్ డీఈ అనురాధ తెలిపారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాలో 25,440 ఎకరాలకు, కాకినాడ జిల్లాలో 7,385 ఎకరాలకు, కుడి ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాలో 7,249 ఎకరాలకు, కాకినాడ జిల్లాలో 11,391 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు.
Similar News
News July 5, 2025
నిజామాబాద్: రేషన్ బియ్యానికి 48,978 మంది దూరం..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 6,60,241 రేషన్ కార్డులు ఉండగా 6,11,263 మంది బియ్యం తీసుకున్నారు. 48,978 మంది రేషన్ తీసుకోలేదు. కాగా మళ్లీ సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనుంది.
News July 5, 2025
ఆచంట: గోదారమ్మకు చేరుతున్న వరద నీరు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటు పెరుగుతోంది. ఆచంట మండలంలో కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కర ఘాట్ల వద్దకు వరద నీరు చేరింది. పోలవరం వద్ద గోదావరికి వరద నీరు భారీగా చేరుకోవడంతో మరో రెండు, మూడు రోజుల్లో మరింత వరద ప్రవాహం ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News July 5, 2025
నీలాక్రమం అలంకరణ భద్రకాళి అమ్మవారు

శనివారం సందర్భంగా భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. నీలాక్రమం అలంకరణలో నేడు భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.