News September 22, 2025
తాండూరులో గర్భిణీ మృతి

తాండూరు ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. కొడంగల్ నియోజకవర్గం రావులపల్లి గ్రామానికి చెందిన అఖిల(21) రెండవ కాన్పు కోసం ఆసుపత్రిలో చేరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Similar News
News September 22, 2025
450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా: కన్నబాబు

తుళ్లూరు స్కిల్ హబ్‌లో ఈ నెల 24న 5 ప్రముఖ కంపెనీలలో 450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని APSSDC సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ.ఫార్మసీ పూర్తి చేసిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులు అమరావతి, VJA, HYDలో పనిచేయాల్సి ఉంటుందన్నారు.
News September 22, 2025
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్చరించారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై వైద్య, ఇతర శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఎవరైనా ఈ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
News September 22, 2025
ఆప్కో వస్త్రాలపై 40% డిస్కౌంట్: మంత్రి సవిత

AP: దసరా, దీపావళి సందర్భంగా APCO వస్త్రాలపై 40% రిబేట్ అందిస్తున్నట్లు చేనేత, జౌళి మంత్రి సవిత ప్రకటించారు. సంస్థ షోరూములలో ఈ రాయితీ అమలవుతుందని తెలిపారు. ఈ కామర్స్‌లో అమ్మకాలతో పాటు డోర్ డెలివరీ కూడా ఆప్కో చేస్తుందన్నారు. చేనేత వస్త్రాలు తెలుగు సంస్కృతికి ప్రతిబింబమని, ఈ నిర్ణయంతో ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. అదే సమయంలో కొనుగోళ్లు పెరిగి చేనేత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు.