News April 11, 2025
తాండూరులో రేపు మాంసం దుకాణాలు బంద్

హనుమాన్ జయంతి సందర్భంగా తాండూరులో రేపు మాంసం దుకాణాలు బంద్ పాటించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ఈమేరకు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆదేశాలతో పట్టణంలోని చికెన్, మటన్, ఫిష్ మాంసం దుకాణాల వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. శనివారం పట్టణంలో మాంసం విక్రయాలపై నిషేధం విధించాలని తెలిపారు. దుకాణాలే కాకుండా హోటల్స్, రెస్టారెంట్లులో ఎక్కడా మాంసం విక్రయాలు చేపట్టరాదని నోటీసులో తెలిపారు.
Similar News
News September 15, 2025
మరో వివాదంలో పూజా ఖేడ్కర్

మహారాష్ట్రకు చెందిన మాజీ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ట్రక్ డ్రైవర్ కిడ్నాప్ విషయంలో ఆమె పేరు బయటికి వచ్చింది. ముంబైలోని ఐరోలిలో డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్ తన ట్రక్‌తో ఓ కారును ఢీకొట్టారు. దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేశారు. పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయగా పుణేలోని పూజా ఇంటిలో చూపించింది. డ్రైవర్‌ను విడిపిస్తున్న క్రమంలో పూజా తల్లి మనోరమ హంగామా చేశారు.
News September 15, 2025
KNR: యూరియా బ్లాక్‌లో అమ్ముతున్నా చర్యలేవి..?

రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని MP బండి సంజయ్ అన్నారు. సరైన ప్లాన్ లేకపోవడం, యూరియాను బ్లాక్‌లో అమ్ముతున్నా చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందన్నారు. రబీ సీజన్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం పంపితే, 2.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మిగిలిందని, దాన్ని ఏం చేశారో కూడా లెక్కా పత్రం లేదన్నారు. వందే భారత్ ప్రారంభోత్సవం వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
News September 15, 2025
సీఎం కాన్ఫరెన్స్‌కు హాజరైన కాకినాడ కలెక్టర్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నుంచి నిర్వహిస్తున్న రెండు రోజుల కలెక్టర్ల సమావేశానికి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత జిల్లాకు సంబంధించిన అంశాలపై ఆయన చర్చిస్తారని అధికారులు తెలిపారు. జిల్లా సమస్యలపై సమగ్ర సమాచారాన్ని కలెక్టర్ తీసుకెళ్లారని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురానున్నారని సమాచారం.