News March 6, 2025
తాండూరు: ఇంటర్ పరీక్ష హాల్లో పాము

తాండూరులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎంతో ఉత్సాహంగా పరీక్షా హాల్‌లోకి వెళ్లిన విద్యార్థులు పరుగులు తీశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలోని ఏ బ్లాక్ రూం నంబర్ 3లో పాము ప్రత్యక్షమైంది. కేకలు వేస్తూ విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. పామును కొట్టి చంపేశారు.
Similar News
News July 5, 2025
జైస్వాల్ ఖాతాలో అరుదైన రికార్డు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ జైస్వాల్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో 28 రన్స్ చేసి ఔటైన జైస్వాల్ టెస్టుల్లో వేగంగా 2000 రన్స్ పూర్తిచేసిన భారత ప్లేయర్‌గా నిలిచారు. 40 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయి చేరుకుని లెజెండ్స్ సెహ్వాగ్, ద్రవిడ్ సరసన చేరారు. మరోవైపు దిగ్గజం సచిన్ తర్వాత 2 వేల రన్స్ పూర్తిచేసిన రెండో యంగెస్ట్ ప్లేయర్‌గా జైస్వాల్ నిలిచారు.
News July 5, 2025
మతపరమైన అంశాల్లో కలగజేసుకోం: భారత్

భారత ప్రభుత్వం మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోదని ఫారిన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు. ‘మత విశ్వాసాలపై ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకోదు. భారత్‌లో మతపరమైన స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ విషయంలో కలగజేసుకోవద్దని భారత్‌ను చైనా <<16940241>>హెచ్చరించిన <<>>విషయం తెలిసిందే.
News July 5, 2025
ఇండ్ల నిర్మాణానికి రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్లు, నిర్మాణ ప్రగతిపై రెవెన్యూ, గృహ నిర్మాణ, పంచాయతీ రాజ్ అధికారులతో కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇండ్ల నిర్మాణానికి మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని డీఆర్డీఓకు సూచించారు. జిల్లాలో మొత్తం 4,779 ఇండ్లు మంజూరయ్యాయని, 1558 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. 2,794 ఇళ్ల మంజూరు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.