News January 24, 2025

తాండూరు ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు

image

ఓపెన్ స్కూల్లో 2024-2025 పదవ తరగతి, ఇంటర్‌లో అడ్మిషన్ తీసుకొనుటకు ఈ నెల 27 నుంచి 29 వరకు తత్కాల్ స్కీం కింద ప్రత్యేక అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాండూరు నంబర్ వన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శివకుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు ఓపెన్ స్కూల్లో సంప్రదించాలని సూచించారు.

Similar News

News February 18, 2026

కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

image

కృష్ణా జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఓపెన్ స్కూల్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం అధికారులతో సమీక్షించారు. విద్య, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని సూచించారు.

News February 18, 2026

వయో వ్రతం ఎలా చేయాలి?

image

వయో వ్రతం ఫాల్గుణ శుక్ల పక్ష పాడ్యమి నుంచి ద్వాదశి వరకు 12 రోజులు సాగుతుంది. ఈ సమయంలో పాలు మాత్రమే తీసుకుంటారు. అందుకే ‘పయోవ్రతం’ అనే పేరొచ్చిందంటారు. వ్రతంలో భాగంగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి, లక్ష్మీనారాయణులను షోడశోపచారాలతో పూజించాలి. బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపై పడుకోవాలి. ద్వాదశి నాడు పూర్ణాహుతితో వ్రతం ముగించాలి. అన్నదానం చేయాలి. నియమ నిష్టలతో చేసే ఈ పూజ అనంత పుణ్యఫలాన్ని ఇస్తుంది.

News February 18, 2026

పాలమూరు: పెళ్లిళ్ల సీజన్.. RTC గుడ్‌న్యూస్

image

ఫాల్గుణ మాసం నేపథ్యంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు ఈనెల 18 నుంచి అద్దెకు ఇస్తున్నట్లు మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రతి కిలోమీటర్‌పై గతంలో కంటే రూ.7/- భారీ తగ్గింపు, 6 గంటల వెయిటింగ్ ఛార్జి మినహాయింపు ఉంటుందని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు చేసుకోవాలని కోరారు.
SHARE IT