News October 10, 2025

తాండూరు: కొడుకు చితికి కొరివి పెట్టిన తల్లి

image

ఫిట్స్‌తో మృతి చెందిన కుమారుడికి దహన సంస్కారాలను నిర్వహించి చితికి తల్లి కొరివి పెట్టిన ఘటన తాండూరులో చోటుచేసుకుంది. మాదారం టౌన్షిప్‌కు చెందిన రాజమ్మ భర్త సింగరేణిలో పనిచేస్తూ చాలా ఏళ్ల క్రితం మరణించాడు. ఇద్దరు కొడుకులలో పెద్ద కొడుకు ఏడాది క్రితం మృతి చెందాడు. చిన్న కుమారుడు నరేష్ గురువారం ఫిట్స్‌తో మృతి చెందాగా శుక్రవారం తల్లి కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించింది.

Similar News

News October 11, 2025

‘కల్కి-2’లో అలియా భట్?

image

‘కల్కి-2’ మూవీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె తప్పుకోవడంతో ఆమె పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి నెలకొంది. ఇందులో నటించాల్సిందిగా అలియా భట్‌ను మూవీ టీమ్ సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పార్ట్-1లో ‘కల్కి’ని గర్భంలో మోస్తున్న ‘సుమతి’ అనే మహిళ పాత్రలో దీపిక కనిపించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రకు ఎవరైతే బాగుంటారో కామెంట్ చేయండి.

News October 11, 2025

రౌడీ షీటర్ల ప్రవర్తనను పరిశీలించాలి: ADB SP

image

రౌడీ షీటర్ల, సస్పెక్ట్ షీటర్ల ప్రవర్తనను ప్రతివారం పరిశీలించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీసులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గన్ లైసెన్సులపై శుక్రవారం సమీక్ష సమావేశంలో మాట్లాడారు. శాంతి భద్రతలకు ఇబ్బందులు కలిగించే వారి వివరాలు తీసుకొని బైండోవర్ చేయాలన్నారు. సన్మార్గంలో ఉన్న, ప్రవర్తన మార్చుకున్న రౌడీలపై రౌడీ షీట్ ఎత్తివేయాలని సూచించారు. నేర పరిశోధనలో మరింత అప్రమత్తతో ఉండాలన్నారు.

News October 11, 2025

అక్టోబర్ 11: చరిత్రలో ఈ రోజు

image

1902: లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జననం
1922: సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు జననం
1942: సినీ నటుడు అమితాబ్ బచ్చన్ జననం
1947: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేష్ జననం
1972: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ జననం
1993: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య జననం
1997: సినీ, నాటక, రచయిత గబ్బిట వెంకటరావు మరణం
✯ అంతర్జాతీయ బాలికా దినోత్సవం