News September 12, 2025
తాండూరు: సంగెంకలాన్ వాగులో గల్లంతు.. శవమై లభ్యం

తాండూరు మండలం సంగెంకలాన్ వాగులో కొట్టుకుపోయిన మొగులప్ప మృతదేహం లభ్యమైంది. వరద ఉద్ధృతి తగ్గడంతో శుక్రవారం ఉదయం గ్రామస్థులు గాలింపు చేపట్టగా, సంగెంకలాన్-చెట్టినాడ్ సిమెంట్ కర్మాగారం మార్గంలో ఓ చెట్టుకు చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని వెలికితీశారు.
Similar News
News September 12, 2025
గత ప్రభుత్వ పాలన అమరావతి నుంచే నడిచింది: సజ్జల

AP: రాజధానిలో ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ చాలు అని.. కొత్త కట్టడాలేమీ అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని, గత ప్రభుత్వ పాలన అక్కడి నుంచే నడిచిందని వివరించారు. విశాఖ నుంచి పాలన చేద్దామని జగన్ అనుకున్నారని, అయితే ఎన్నికలు రావడంతో అది కుదరలేదని చెప్పారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖతో పాటు అమరావతి కూడా అభివృద్ధి అయ్యేదని చెప్పారు.
News September 12, 2025
BREAKING.. KMR: బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ వాయిదా

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క చెప్పారు. శుక్రవారం మాచారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తిరిగి సభను నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
News September 12, 2025
రాజధానిలో ఎవరైనా ఇండస్ట్రీలు కడతారా: సజ్జల

రాజధానిలో ఎవరైనా ఇండస్ట్రీలు కడతారా అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి కోసం చేసిన రూ.లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారని ఆయన ప్రశ్నించారు. ‘కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకువచ్చి అయినా రాజధాని కడితే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ రూ.లక్ష కోట్లు ఇప్పటికే రాజధాని పేరుతో వృథా చేశారు. వైజాగ్, కర్నూలు, విజయవాడలో కూడా రాజధాని పెట్టొచ్చు’ అని సజ్జల వ్యాఖ్యానించారు.