News April 9, 2025
తాండూర్: ఉచితంగా శిక్షణ

తాండూరు ప్రాంతంలోని అమ్మాయిలకు, మహిళలకు టైలరింగ్, మెహెందీ డిజైన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ నెల 15వ తేది నుంచి తాండూరు పట్టణం ముర్షద్ దర్గా సమీపంలోని కార్యాలయంలో అన్ని వర్గాల అమ్మాయిలు, మహిళలకు టైలరింగ్, మెహెందీ డిజైన్లలో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు.
Similar News
News February 16, 2026
HYD: WOW.. అదిరిందిగా.. కొత్త కమిషనరేట్

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముస్తాబవుతోంది. మేడిపల్లిలోని 56 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న పనులు తుదిదశకు చేరుకున్నాయి. అత్యాధునిక వసతులతో రణగొణధ్వనులకు దూరంగా, రాజసం ఉట్టిపడేలా రూపుదిద్దుకుంటోంది. ప్రజా భద్రత, పరిపాలనా సమర్థతను మరింత బలోపేతం చేసేలా నిర్మితమవుతున్న ఈ కార్యాలయం, పోలీసు వ్యవస్థకు కీలక కేంద్రంగా మారనుంది. రాష్ట్ర సచివాలయాన్ని తలపిస్తూ కనువిందు చేస్తోంది.
News February 16, 2026
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి: సూర్యాపేట కలెక్టర్

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సోమవారం స్థానిక జూనియర్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈనెల 20 నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో సూర్యాపేట విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
News February 16, 2026
‘అంబటికి చట్టబద్ధమైన వసతులన్నీ కల్పించండి’

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు స్థాయికి తగినట్లు చట్ట ప్రకారం కల్పించాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎం.కుముదుని ఆదేశించారు. వసతుల గురించి రాంబాబు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా సోమవారం ఆదేశాలు ఇచ్చారు. కాగా పోలీసులు రాంబాబు బెయిల్ పిటిషన్‌పై బుధవారం కుముదుని ఉత్తర్వులు జారీ చేయనున్నారు.


