News March 29, 2025

తాండూర్ ఎంపీడీవో గదిలో పాము కలకలం 

image

వికారాబాద్ జిల్లా తాండూర్ మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీవో గదిలో గురువారం పాము ప్రత్యక్షమైంది. అటెండర్ రోజూలానే గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా పాము కనిపించింది. దీంతో సిబ్బందికి సమాచారం ఇవ్వగా చంపేశారు. కార్యాలయ పరిసరాల్లో పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు ఉండటంతో విష సర్పాలు సంచరిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. కార్యాలయాల్లో పరిసరాలను పరిశుభ్రం చేయాలని పలువురు కోరుతున్నారు.

Similar News

News March 1, 2026

HYD: ‘CM కాలి గోటికి కూడా KTR, హరీశ్‌ సరిపోరు’

image

KTR, హరీశ్‌రావు ఇద్దరు కలిసినా రేవంత్ రెడ్డి కాలి గోటికి సరిపోరని కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ విమర్శించారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. అధికారం పోగానే గుంటనక్క KTR సాధు జంతువు అయ్యారా అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో నగరంలోని పలు ప్రాంతాలను కబ్జాలు చేసింది మీరు కాదా అని మండిపడ్డారు. BRS లాంటి నీచరాజకీయాలు కాంగ్రెస్ చేయదని వ్యాఖ్యానించారు.

News March 1, 2026

ఆర్టీసీ డ్రైవర్ పోస్టుకు 6 అడుగుల ఎత్తు ఉండాలా? మంత్రి క్లారిటీ

image

TG: RTC డ్రైవర్ పోస్టుకు 6 అడుగుల ఎత్తు ఉండాలన్న ప్రచారాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ‘RTC నియామకాలకు RTCకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆర్టీసీ నియామకాలు పోలీసు రిక్రూట్‌‌మెంట్‌ సెల్ పరిధిలో చేపడతారు. డ్రైవర్ పోస్టుకు 6 అడుగుల ఎత్తు ఉండాలనేది తప్పుడు ప్రచారం. MV యాక్ట్ ప్రకారం 5.3అడుగులు(160cm) ప్రామాణికం. రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే లీగల్ చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.

News March 1, 2026

108 అంబులెన్స్‌ల్లో ఉద్యోగ అవకాశాలు.. రేపు ఇంటర్వ్యూలు

image

వరంగల్ జిల్లా 108 సర్వీసుల్లో ఈఎంటీ, డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్ తెలిపారు. 30 ఏళ్ల లోపు వయస్సు ఉండి ఎంఎల్టీ, జీఎన్ఎం, ఏఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ అసలు ధృవీకరణ పత్రాలతో ఆదివారం హనుమకొండ కలెక్టరేట్‌లోని 108 కార్యాలయంలో హాజరు కావాలన్నారు.