News February 8, 2025

తాండూర్: పింఛను డబ్బుల కోసం నానమ్మపై దాడి!

image

పింఛన్ డబ్బుల కోసం నానమ్మపై దాడి చేసిన ఘటన కర్ణకోట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ విట్టల్ రెడ్డి వివరాలిలా.. చెంగోల్ గ్రామానికి చెందిన మానెమ్మను ఆమె మనవడు నరేశ్ పింఛన్ డబ్బులు ఇవ్వాలని వేధించాడు. ఆమె ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపంతో నరేశ్ ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డు తీసుకుని తలపై దాడి చేశాడు. గాయపడ్డ ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 3, 2025

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్బ్రాంతి

image

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాపూర్ గేటు వద్ద ఆర్టీసి బస్సు ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కంకర లోడ్‌తో ఉన్న టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారన్నారు.

News November 3, 2025

పల్నాడులో అమరావతి ORR భూసేకరణకు నోటిఫికేషన్

image

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో పల్నాడు జిల్లాకు సంబంధించి కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 478.38 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. అమరావతి తాలూకాలోని లింగాపురం, ధరణికోట గ్రామాల్లో భూమిని సేకరిస్తారు. పెదకూరపాడు తాలూకాలోని ముస్సపురం, పాటిబండ్ల, జలాలపురం, కంభం పాడు, తల్లూరు, లింగంగుంట్ల, బలుసుపాడు గ్రామాల్లో భూసేకరణ జరగనుంది.

News November 3, 2025

మీర్జాగూడ ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

TG: మీర్జాగూడ<<18183462>> ప్రమాదంలో<<>> మృతులంతా చేవెళ్ల వాసులేనని తెలుస్తోంది. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగులే ఉన్నారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యల పర్యవేక్షణకు సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాంటాక్ట్ నం: 9912919545, 9440854433.