News September 10, 2025
తాండూర్: బిర్యానీలో బొద్దింక.. 25 వేలు జరిమానా

తాండూర్‌లోని శ్రీ దుర్గా గ్యాండర్ రెస్టారెంట్‌లో బిర్యానీలో బొద్దింక కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం చికెన్ బిర్యాని తినే సమయంలో కస్టమర్‌కు బిర్యానీలో బొద్దింక కనిపించడంతో రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీశారు. వారు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో మున్సిపల్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు రెస్టారెంట్‌ను తనిఖీ చేసి రూ.25 వేలు జరిమానా విధించారు.
Similar News
News September 10, 2025
సిరిసిల్ల: ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిరిసిల్లలోని కలెక్టరేట్లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని వివరించారు. తెలంగాణ పౌరుషం, పోరాటం, త్యాగాన్ని ఆమె భావితరాలకు అందించారన్నారు.
News September 10, 2025
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అప్డేట్ @7AM

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ నిండు కుండను తలపిస్తోంది. ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి 54,545 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. అటు ప్రాజెక్టులో 80.5 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 8 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు.
News September 10, 2025
రైతుల కోసం అగ్రికల్చర్ వాట్సాప్ ఛానల్ ప్రారంభం

రాష్ట్ర వ్యవసాయశాఖ కొత్తగా వాట్సప్ ఛానెల్ ను ప్రారంభించింది. అగ్రికల్చర్ డిపార్టుమెంట్ తెలంగాణ పేరుతో గత నెల 8న అందుబాటులోకి తెచ్చింది. నెల రోజుల్లోనే దాదాపు 35 వేల మంది రైతులు ఫాలోవర్స్ గా ఉన్నారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు తెలంగాణ రైతాంగానికి కీలకమైన సమాచారం, సలహాలు, సూచనలను వ్యవసాయ శాఖ అందిస్తోంది. జగిత్యాల జిల్లాలో మెత్తం 2,48,550 మంది రైతులు ఉండగా, 4,18,569 ఎకరాల సాగుభూమి ఉంది.