News March 13, 2025
తాండూర్: రూ.1.30లక్షల తాకట్టు నగదు చోరీ!

తాండూరు పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.1.30 లక్షల లోన్ తీసుకున్నారు. తదనంతరం మళ్లీ కారులో బయలుదేరారు. కొద్ది దూరంలో టైర్ పంచర్ కావడంతో శారద భర్త రాజు కారు టైర్ పంచర్ చేయించడానికి తీసుకెళ్లాడు. ఇదంతా గమనించిన ఓ దుండగుడు భార్య శారదకు మాయమాటలు చెప్పి కారులో నుంచి దించి డబ్బుల బ్యాగుతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితులు తాండూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News March 13, 2025
కొల్లూరు: లారీ బోల్తా

కంకర పోసుకుని వెళుతున్న లారీ బోల్తా పడిన ఘటన కొల్లూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన లారీ గుంటూరు నుంచి కంకర లోడ్‌తో గురువారం తెల్లవారుజామున వెళుతుండగా సిమెంట్ రోడ్డు ఒక్కసారిగా ధ్వంసమైంది. దీంతో లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడిందని అన్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని స్థానికులు తెలిపారు.
News March 13, 2025
కేటిదొడ్డి: పంట పొల్లాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్

కేటిదొడ్డి మండలం కొండాపురం, గువ్వలదిన్నె గ్రామాల్లో వరి పొలాలను గురువారం జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్, వ్యవసాయ అధికారులతో కలిసి పర్యటించారు. ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా ఆయకట్టు కింద పొలాలకు సాగు నీరందడం లేదని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కలెక్టర్ పర్యటించారు. ఆయకట్టు కింద సాగు నీరందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
News March 13, 2025
HYD సెంట్రల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు

ప్రపంచంలోనే HYD సెంట్రల్ యూనివర్సిటీ అత్యుత్తమ వర్సిటీగా గుర్తింపు దక్కించుకుంది. లండన్‌కు చెందిన QS సంస్థ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. 2025కి గానూ హెచ్‌సీయూ 7 సబ్జెక్టుల్లో మంచి ర్యాంకింగ్ సాధించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా హెచ్‌సీయూ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.బీజేరావు మాట్లాడుతూ.. మరింత శ్రమించి హెచ్‌సీయూ ఉనికిని విస్తరిస్తామన్నారు.