News July 6, 2025

తాండూర్: లారీ ఢీకొని ఒకరి మృతి

image

తాండూరు మండలం బోయపల్లి బోర్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక డాబా నుంచి బిర్యానీ తీసుకుని తాండూర్ బోర్డు వైపుగా వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కాసిపేటకు చెందిన మల్లేశ్ గౌడ్(36)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Similar News

News July 6, 2025

రేపు స్కూళ్లకు సెలవు అంటూ మెసేజులు

image

TG: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సోమవారం సెలవు ప్రకటించాయి. మొహర్రం సందర్భంగా సెలవు అంటూ తల్లిదండ్రులకు మెసేజులు పంపుతున్నాయి. కాగా తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం మొహర్రం పబ్లిక్ హాలిడే ఇవాళే ఉంది. రేపు అధికారికంగా సెలవు ప్రకటించకపోయినా కొన్ని ప్రైవేట్ స్కూళ్లు మాత్రం హాలిడే ఇచ్చాయి. మరి మీకు సెలవు ఉందని మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.

News July 6, 2025

HYD: డ్రంక్‌ అండ్ డ్రైవ్.. 105‌ మందిపై చర్యలు

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ పరిధిలో పట్టుబడ్డ 105 మందిని నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణలో రూ.2.39 లక్షల జరిమానా విధించబడింది. కొందరికి జైలు శిక్షలు కూడా విధించారు. ఈ చర్యలు ప్రజల్లో ట్రాఫిక్ అవగాహన పెంపొందించేందుకు చేపట్టినవని సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ACP మోహన్ కుమార్ తెలిపారు.

News July 6, 2025

లోకేశ్‌తో KTR పదే పదే చర్చలు: సామ రామ్మోహన్

image

సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లకు కేటీఆర్ ప్రతిసవాళ్లు విసరడం హాస్యస్పదమని TPCC మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద రేపు చర్చకు రావాలని KTRకు సవాల్ విసిరారు. రైతుల సంక్షేమంపై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. లోకేశ్‌తో కేటీఆర్ పదే పదే రహస్య మంతనాలు జరపడంపై కూడా సమాధానం చెప్పాలని సామ రామ్మోహన్ డిమాండ్ చేశారు.