News August 17, 2025

తాంసి: ఒకరికి తీవ్ర గాయాలు ఆవు మృతి

image

తాంసి మండలం పొన్నారి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఆవు ఇద్దరు మహిళలను పొడవడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. ఆవు దాడికి ఆగ్రహించిన అదే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కత్తితో ఆవుపై దాడి చేయడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది.

Similar News

News August 17, 2025

2040 వరకు రాజకీయాల్లో ఉంటా: సీఎం రేవంత్

image

TG: తాను 2040 వరకు రాజకీయాల్లో కొనసాగుతానని CM రేవంత్ తెలిపారు. తెలంగాణకు రెండో CM కావడం తన అదృష్టమని పేర్కొన్నారు. అందెశ్రీ ప్రచురించిన ‘హసిత భాష్పాలు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో CM మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రజలు నా భుజాలపై పెద్ద బాధ్యత పెట్టారు. ఈ అవకాశాన్ని వారి అభ్యున్నతికే వినియోగిస్తా. ప్రజలపై అధికారాన్ని వాడే మూర్ఖుడిని కాదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేను పదవిని వాడను’ అని ఆయన పేర్కొన్నారు.

News August 17, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 17, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.44 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.00 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.20 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.47 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.41 గంటలకు
✒ ఇష: రాత్రి 7.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.