News August 16, 2025

తాంసి మండలంలో అత్యధిక వర్షపాతం

image

జిల్లావ్యాప్తంగా కురిసిన వర్ష పాతం నమోదు వివరాలను అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం 8 నుంచి 11 గంటలకు వరకు తాంసి మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. తాంసిలో 142.0 మి.మీ, తలమడుగు 140.3, సిరికొండ 135.0, గుడిహత్నూర్ 133.3, రాంనగర్ 129.0, సాత్నాల 125.5, హీరాపూర్ 122.2, ఇచ్చోడ 114.3 మి.మీ వర్షపాతం రికార్డయింది.

Similar News

News August 17, 2025

ADB: సహాయక చర్యల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు

image

ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులకు వెంటనే సహాయం అందించేందుకు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌తో పాటు మున్సిపాలిటీ టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు తమ సమస్యలను కంట్రోల్ రూమ్ నంబర్: 18004251939, మున్సిపాలిటీ టోల్‌ఫ్రీ 9492164153కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు. సమాచారం అందిన వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.

News August 16, 2025

ADB: ప్రేమకు ప్రతిరూపం రాధాకృష్ణులు

image

కృష్ణుడి ప్రేమ, ఆధ్యాత్మికతకు ప్రతీక రాధ. రాధాకృష్ణుల ప్రేమ బంధాలకు అతీతమైనది. వారి అనుబంధం దైవిక ప్రేమ, నిస్వార్థ భక్తికి నిలువెత్తు నిదర్శనం. భీంపూర్(M)లో కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం గుబిడిలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకల్లో చిన్నారులు వేసిన శ్రీ కృష్ణుడు, గోపికల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుకలు తిలకించేందుకు గ్రామస్థులు ఒకచోట చేరారు.

News August 16, 2025

ADB: రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలు ప్రారంభం

image

క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు విజేతనే అని తెలంగాణ రాష్ట్ర బేస్ బాల్ సంఘం అధ్యక్షుడు హరిశంకర్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ బేస్ బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రం నుంచి దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొనగా వారికి అవసరమైన పూర్తి సౌకర్యాలు కల్పించారు. జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.