News March 19, 2024
తాంసి: వార్డెన్ సస్పెండ్.. సిబ్బందికి షోకాజ్ నోటీసులు
తాంసి ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ ఎటువంటి అనుమతి లేకుండా గైర్హాజరు అవుతున్నట్లు ఆమె గుర్తించారు. పరీక్షల సమయంలో వార్డెన్ గైర్హాజరును తీవ్రంగా పరిగణించిన ఆమె వార్డెన్ స్వప్నను సస్పెండ్ చేశారు. అదేవిధంగా విధులకు గైర్హాజరు అవుతున్న బోధనేతర సిబ్బంది విజయ్, మహేందర్‌కు షోకాజ్ నోటీసులు అందజేశారు.
Similar News
News January 7, 2025
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి: MNCL కలెక్టర్
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 29 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిష్కరించేలా కృషి చేయడం జరుగుతుందన్నారు.
News January 7, 2025
మందమర్రి ఏరియాలో పర్యటించిన డైరెక్టర్
సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి మందమర్రి ఏరియాలో సోమవారం పర్యటించారు.GM దేవేందర్‌తో కలిసి ఏరియాలోని KK-OCPసందర్శించి పని ప్రదేశాలను పరిశీలించారు. ఉత్పత్తి ఉత్పాదకతపై సమీక్షించారు. రవాణాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు అంకితాభావంతో పనిచేసినప్పుడే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం సులువుతుందన్నారు.
News January 7, 2025
ఖానాపూర్‌లో చైనా మాంజా కలకలం
ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో చైనా మాంజా తగిలి ఒకరు గాయపడ్డారు. ఆ కాలనీకి చెందిన పరిమి చంద్ర విలాస్ పనిలో భాగంగా చేపలు పట్టడం కోసం సోమవారం గోదావరికి వెళ్తున్న సమయంలో జూనియర్ కాలేజ్ రోడ్డుపై పడిన చైనా మాంజా అకస్మాత్తుగా ఆయన గొంతుకు తగిలి కట్టయ్యింది. స్థానికులు ఆయనను మొదట ఖానాపూర్ ఆస్పత్రికి, అటు నుంచి నిర్మల్ ఆసుపత్రికి తరలించగా నాలుగు కుట్లు పడ్డాయి. ఈ సంఘటన ఖానాపూర్‌లో సంచలనం రేపింది.