News September 6, 2024
తాగుడుకు బానిసైన భర్త.. భార్య తిట్టిందని సూసైడ్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన మెర్ల సత్తయ్య(53) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. SI శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మద్యానికి బానిసైన సత్తయ్య రోజూ తాగి ఇంటికి రావడంతో భార్య మందలించింది. కోపంతో గురువారం పురుగు మందు తాగిన సత్తయ్య.. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్సై తెలుపారు.
Similar News
News December 20, 2025
లోకేశ్ పర్యటన అంతా ఆర్భాటమే: మార్గాని

మంత్రి లోకేశ్ రాజమండ్రి పర్యటన కేవలం ఆర్భాటం తప్ప మరేమీ లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ శనివారం విమర్శించారు. పర్యటన సాగిన ప్రతిచోటా వైసీపీ మార్క్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆసుపత్రిలో బాలింత మృతి, బాలికపై అత్యాచారం వంటి దారుణ ఘటనలపై మంత్రి స్పందించకపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల వైఫల్యాన్ని వదిలి లోకేశ్ ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
News December 19, 2025
గన్ని కృష్ణకు పీజీ పట్టా అందించిన మంత్రి లోకేశ్

ఏడు పదుల వయసులో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పట్టాను అందజేశారు. శుక్రవారం రాజమండ్రిలో జరిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమావేశంలో గన్ని కృష్ణను లోకేష్ అభినందించారు. ఈ వయసులో చదివి పట్టా సాధించడం నేటి యువతకు ఆదర్శవంతమన్నారు. విద్య ద్వారానే జ్ఞాన సముపార్జన సాధ్యమని లోకేశ్ పేర్కొన్నారు.
News December 19, 2025
విరాళాల సేకరణలో తూ.గో జిల్లాకు 3వ స్థానం

సాయుధ దళాల జెండా దినోత్సవం(2024-25) సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జెండా విక్రయాలు, హుండీలు, విరాళాల ద్వారా మొత్తం రూ.12,73,105 నిధులు సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ సేకరణతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా మూడవ స్థానంలో నిలిచిందని కలెక్టర్ వెల్లడించారు. సైనికుల సంక్షేమం కోసం విరాళాలు అందించిన దాతలను ఆమె అభినందించారు.


