News April 2, 2024

తాగునీటికి సమస్య ఉండకూడదు: కలెక్టర్

image

ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సిబ్బందికి ఆదేశించారు. తాగునీటి చెరువులను, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని, నీటి నిల్వలకు అనుగుణంగా వేసవి మొత్తం సరఫరాకు చేసేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. రానున్న రోజులలో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News July 5, 2024

వీరఘట్టం: వైయస్సార్ విగ్రహం ధ్వంసం

image

వీరఘట్టం మండలం తూడిలోని వైయస్సార్ విగ్రహాన్ని దుండగులు 2రోజుల క్రితం పాక్షికంగా ధ్వంసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని సచివాలయం గేటును విరగొట్టి సమీపంలో ఉన్న పంట పొలాల్లో విసిరేశారని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనలపై పంచాయతీ కార్యదర్శి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్.ఐ కళాదర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 5, 2024

శ్రీకాకుళం: జాబ్ మేళా.. 16 మంది ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించగా.. నిరుద్యోగ యువత 88 మంది హాజరయ్యారు. ఇందులో 16 మందిని ఎంపిక చేసి, వారికి ఉపాధి కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సుధా తెలిపారు.

News July 5, 2024

శ్రీకాకుళం: నేటితో ముగుస్తున్న ఫీజు చెల్లింపు గడువు

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ డిగ్రీ చివరి ఏడాది 5వ సెమిస్టర్ ఇన్స్టంట్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్ 29 నుంచి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఈ పరీక్షకు అర్హులైన జాబితాను ఆయా కళాశాలలకు అధికారులు అందజేశారు. ఇంకా చెల్లించని విద్యార్థులు నేడు సాయంత్రం లోగా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.