News March 19, 2025
తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అభిలాష అభినవ్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ కూలీలకు ఉపాధి కల్పన, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.
Similar News
News February 26, 2026
గద్వాల్ జిల్లా DROగా పద్మజ రాణి

జోగులాంబ గద్వాల జిల్లాలో పలువురు ప్రభుత్వ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు DRO గా పద్మజ రాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అదే విధంగా జిల్లాలో ఆర్డీవో బాధ్యతలో ఉన్న ఉన్న అలివేలును హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్న టి.శ్రీనివాస్ రావును జిల్లా రెవెన్యూ అభివృద్ధి శాఖ అధికారిగా బదిలీ చేశారు.
News February 26, 2026
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదుగురు డీఎస్పీల బదిలీ

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్లు వెల్లడించారు. బదిలీ అయిన వారిలో సౌత్ ఏసీపీ పవన్ కుమార్, ఎస్బీ ఏసీపీ భాను, అవనిగడ్డ డీఎస్పీ విద్య శ్రీ, మచిలీపట్నం డీఎస్పీ రాజా, గుడివాడ డీఎస్పీ వినీల్ ఉన్నారు. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News February 26, 2026
ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

టారిఫ్‌ల విషయంలో <<19195677>>ఎదురుదెబ్బ<<>> తిన్న US అధ్యక్షుడు ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. అక్రమ వలసదారులను వారి దేశాలకు కాకుండా ఇతర దేశాలకు తరలించడాన్ని ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది. వారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం సరికాదని, చట్టబద్ధత కూడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవకాశమిచ్చింది.


