News March 17, 2025
తాగునీటి సమస్యపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్

శ్రీ సత్య సాయి జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, ఆర్డీవోలు నీటి సమస్యపై నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి తాగునీరు, వడగాల్పులు, పి-4 సర్వే, రీ సర్వే, పీజీఆర్ఎస్ అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని విపత్తుల శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తే ప్రాంతాలను గుర్తించాలన్నారు.
Similar News
News October 17, 2025
ఫిట్‌మ్యాన్‌లా మారిన హిట్‌మ్యాన్

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నెస్‌తో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు రెడీ అవుతున్నారు. తాజా ఫొటో షూట్‌లో రోహిత్ సన్నగా కనబడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫొటో షూట్‌లో లావుగా ఉన్న రోహిత్.. వర్కౌట్స్ చేసి సన్నబడ్డారు. గతంలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన హిట్‌మ్యాన్.. మళ్లీ అలాంటి ఫీట్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
News October 17, 2025
నెల్లూరులో ఆక్రమణలపై కొరడా..!

ఇటీవల NMC అధికారులు రోడ్డు మార్జిన్లపై కొరాడ జలిపిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరులో సైడు కాలువలపై ఆక్రమణలు పెరిగిపోయాయి. ప్రధాన ట్రంకురోడ్డు, పొదలకూరు రోడ్డు, రంగనాయకులపేట, సంతపేట, గాంధీ బొమ్మ, కనకమహాల్ ఇలా ప్రధానమైన చోట్ల కాలువలను ఆక్రమించేశారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా కార్పొరేషన్ ఆక్రమనలను తొలగిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్లా అక్రమణలను ధ్వంసం చేస్తున్నారు.
News October 17, 2025
ములుగుకు కేంద్రీయ విద్యాలయం మంజూరు: ఎంపీ

ములుగుకు ప్రతిష్ఠాత్మకమైన కేంద్రీయ విద్యాలయం మంజూరైనట్లు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తెలిపారు. ములుగు ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ విద్యాలయాన్ని మంజూరు చేయించినట్లు తెలిపారు. మోడికుంటవాగు ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. ట్రైబల్ సెంట్రల్ వర్సిటీ పనులను వేగవంతం చేయిస్తామని చెప్పారు.