News November 8, 2025
తాజా సినీ ముచ్చట్లు!

✏ హీరో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి రిలీజైన ‘చికిరి చికిరి’ లిరికల్ సాంగ్‌కు 24 గంటల్లో 46మిలియన్ల వ్యూస్ వచ్చాయి. IND సినిమాలో ఒక్కరోజులో అత్యధిక వీక్షణలు సాధించిన సాంగ్ ఇదే.
✏ మహేశ్- రాజమౌళి మూవీ మేకర్స్ ఈనెల 15న జరిగే ‘GlobeTrotter’ ఈవెంట్‌లో 100ft పొడవు & 130ft వెడల్పుతో భారీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కనీవినీ ఎరుగని రీతిలో 3 ని.ల గ్లింప్స్ వీడియో ప్రదర్శిస్తారని టాక్.
Similar News
News April 5, 2026
నేడు SRH మ్యాచ్.. HYDకు వర్షసూచన ఉందా?

IPL: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఇవాళ SRH, LSG తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో HYD వాతావరణ కేంద్రం అప్డేట్ ఇచ్చింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈదురు గాలులతో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. SRH మ్యాచ్ 3.30 గంటలకు కావడంతో వర్షం పడినా పెద్దగా అంతరాయం కలగకపోవచ్చు. ఇవాళ SRH, LSGలలో ఏ జట్టు గెలుస్తుంది?
News April 5, 2026
మరో అమెరికన్ ఫ్లైట్‌ను కూల్చేసిన ఇరాన్?

ఇరాన్‌లో కూలిన F-15E యుద్ధ విమానంలోని రెండో పైలట్‌ను కాపాడినట్లు ట్రంప్ ప్రకటించిన గంటల్లోనే అమెరికాకు మరో షాక్ తగిలినట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న మరో విమానాన్ని కూల్చినట్లు IRGC ప్రకటించింది. ఇస్ఫహాన్ సౌత్‌లో ఈ ఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అమెరికా ఇంకా ధ్రువీకరించలేదు.
News April 5, 2026
బాలీవుడ్‌లో దారుణమైన అంశమిదే: డైరెక్టర్ ప్రియదర్శన్

బాలీవుడ్ కల్చర్‌పై ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ అసహనం వ్యక్తం చేశారు. ‘అక్కడ సెట్‌లో నలుగురు యాక్టర్లతో పాటు 40-60 వర్కర్లు ఉంటారు. నటులకు జుట్టు లేకపోయినా సరిచేస్తూ, తాకుతూ ఉంటారు. నటుల చుట్టూ ఉండే సామగ్రి నా డైరెక్షన్ సెటప్ కంటే ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్‌లో కొనసాగుతున్న దారుణమైన అంశం ఇదే. ఇలాంటివి నాకు నచ్చవు. సౌత్ ఇండస్ట్రీలో ఇలా ఉండదు. వర్కర్లు సెట్‌కు బయటే ఉంటారు’ అని పేర్కొన్నారు.


