News January 1, 2026

తాటిపూడి జలాశయంలో నేటి నుంచి బోటింగ్ సెషన్ స్టార్ట్

image

తాటిపూడి రిజర్వాయర్‌ విజయనగరం జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇక్కడ రెండో దశ బోటింగ్ సేవలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డిసెంబర్ 27న ప్రారంభించారు. కొత్తగా 10 బోట్లను ప్రవేశపెట్టారు. వాటిలో 19 సీట్ల వాటర్ టాక్సీలు, 6 సీటర్ స్పీడ్ బోట్స్ ఉన్నాయి. నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Similar News

News January 1, 2026

జగిత్యాల: సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

image

జగిత్యాల జిల్లా AEO అసోసియేషన్ తరఫున జిల్లా కలెక్టర్‌ను జిల్లా వ్యవసాయ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై సానుకూల చర్చ జరిగింది. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్ నాయక్, ప్రధాన కార్యదర్శి అయ్యోరీ వినోద్‌తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వారికి సూచించారు.

News January 1, 2026

టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS : సీపీ

image

JAN 3 నుండి 20 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాలలో నిర్వహించే టీజీ టెట్ పరీక్షల సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అటు సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

News January 1, 2026

గన్నేరువరం: మానసా దేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గన్నేరువరం మండలం కాసింపేట సుప్రసిద్ధ స్వయంభు మానసా దేవి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు గురువారం పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవార్ల దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో గంటల తరబడి ఓపికగా నిలబడ్డారు. అమ్మవార్లను దర్శించుకుని పెద్ద సంఖ్యలో ముడుపులు సమర్పించారు.