News January 11, 2026

తాడికొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

image

తాడికొండ (మ) లాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుళ్లూరుకి చెందిన అఖిల్ (19), తరుణ్(17) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గుంటూరు GGHలో చికిత్స పొందుతున్నారు. తుళ్లూరు నుంచి ఐదుగురు యువకులు తాడికొండ YCP ఇన్‌ఛార్జ్ డైమండ్ బాబును కలిసి తిరిగి వచ్చే సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News February 14, 2026

కొత్తగూడెం: CPI హ్యాండిచ్చినా.. కాంగ్రెస్‌కు డోకా లేదు

image

అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్(31 సీట్లు) దాటకపోవడంతో ఎవరు పైచేయి సాధిస్తారనే ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ 22సీట్లు గెలుచుకోగా, మిత్రపక్షం CPM1, ముగ్గురు BRS, మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ గూటికి చేరడంతో 29కి చేరింది. ఎంపీ RRR ఎక్స్‌అఫీషియో ఓటు కలిగి ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌కు CPI మద్దతు లేకపోయినా పాలకవర్గం ఏర్పాటు చేసే క్లారిటీ వచ్చింది.

News February 14, 2026

లవర్స్‌కు నెల్లూరు కలెక్టర్ సలహా ఇదే

image

నేటి యువత భవిష్యత్తులో స్థిరపడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే తమకు ఇష్టమైన జీవిత భాగస్వామిని ఎంచుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. <<19130524>>ప్రేమికుల రోజు<<>>ను పురస్కరించుకొని Way2Newsతో ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. యువత మొదట చదువు పూర్తి చేసి, మంచి ఉద్యోగం, ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. తొందర్పాటు నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు శోఖాన్ని మిగల్చవద్దని వివరించారు.
#Valentine’s Day

News February 14, 2026

ఉల్లి.. రూ.100కే 6 కేజీలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో రూ.100కే 6 కేజీలు విక్రయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.20కి అమ్ముతున్నారు. టమాటా రేట్లు కూడా పడిపోయాయి. కేజీ రూ.10-15 పలుకుతోంది. వంకాయ కేజీ రూ.25-30కే లభిస్తోంది. దొండకాయ రూ.50, పచ్చిమిర్చి రూ.50, క్యాప్సికం రూ.45కు విక్రయిస్తున్నారు.