News April 24, 2024
తాడికొండ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు.. పలువురి పేర్లు ప్రకటన
ఏపీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు వెల్లడించింది. తాడికొండ(ఎస్సీ) నియోజకవర్గానికి చిలకా విజయ్ కుమార్ స్థానంలో మణిచల సుశీల్ రాజా పేరును ఖరారు చేసింది. రేపల్లె- మోపిదేవి శ్రీనివాసరావు, తెనాలి – ఎస్కే బషీద్ , గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి డాక్టర్. రాచకొండ జాన్ బాబు పేర్లను అధిష్ఠానం ప్రకటించింది.
Similar News
News February 5, 2025
గుంటూరులో వైద్యం వికటించి చిన్నారి మృతి
లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌత్రాడౌన్‌లో అంజుమ్ అనే చిన్నారి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి మరణించిందని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. జలుబుతో ఇబ్బంది పడుతుందని చిన్నారిని ఆసుపత్రిలో చూపించడానికి వస్తే ఇలా జరిగిందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమౌతున్నారు. లాలాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 5, 2025
నగ్న వీడియోలతో బెదిరింపులు.. గుంటూరు వ్యక్తిపై కేసు
సాఫ్ట్వేర్ యువతులను ట్రాప్ చేసి వీడియో కాల్స్ రికార్డ్ చేసి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మస్తాన్ సాయి గుంటూరు, నల్లచెరువు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బీటెక్ నుంచే అడ్డదారి పట్టాడని, నిందితుడు తండ్రి మస్తాన్ దర్గాకు వారసత్వ ధర్మకర్త కాగా మస్తాన్ వద్ద 80పైగా వీడియో కాల్స్ దృశ్యాలు ఉన్నాయన్నారు.
News February 5, 2025
తెనాలి: రైలు నుంచి జారిపడి వాచ్ మెన్ మృతి
రైలు నుంచి జారి పడి గాయాలపాలైన ప్రయాణికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చీరాలకు చెందిన భాస్కర్(48) నిడుబ్రోలులోని రైతుబజార్లో వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం రైలులో ప్రయాణిస్తూ తెనాలి స్టేషన్లో రైలు నుంచి జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు వైద్యశాలకు పంపగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. తెనాలి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.