News December 18, 2025
తాడిచర్ల సర్పంచ్‌కు భారీ మెజార్టీ

జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో తాడిచర్ల సర్పంచిగా బండి స్వామి విజయం సాధించి రికార్డు సృష్టించారు. గ్రామంలో 5,157 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ బలపరిచిన బండి స్వామికి 3,394 ఓట్లు లభించాయి. సమీప ప్రత్యర్థి రావుల కల్పనకు కేవలం 831 ఓట్లు వచ్చాయి. దీంతో స్వామి 2,563 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ స్థాయిలో మెజారిటీ రావడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మద్దతుదారుల సంబరాలు మిన్నంటాయి.
Similar News
News December 25, 2025
ధాన్యం సేకరణలో NZB జిల్లాకు మొదటి స్థానం

వానాకాలం సీజన్ కుసంబంధించి రాష్ట్రంలో ధాన్యం సేకరణ ముగిసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో మొత్తం 8,447 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం మొత్తం 62,14,099 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 12,04,591 మంది రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యం విలువ రూ.14,840.11 కోట్లు. ధాన్యం సేకరణలో రాష్ట్ర వ్యాప్తంగా NZB జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో 7.02Mt లకు గాను 6,93,288 tnలు సేకరించారు.
News December 25, 2025
యలమంచిలి: తండ్రి క్షణికావేశం.. అనాథ అయిన చిన్నారి

క్షణికావేశంలో తండ్రి చేసిన తప్పుకు ఆ చిన్నారి అనాథ అయింది. బుధవారం యలమంచిలి పట్టణంలో <<18659799>>మాయ<<>> అనే వివాహితను భర్త రాకేశ్ కిరాతంగా చంపాడు. వీరికి 4 నెలల చిన్నారి ఉంది. తల్లి (మాయ) మృతి.. తండ్రి (రాకేశ్) కటకటాలపాలయ్యాడు. దీంతో అనాథగా మారిన ఆ చిన్నారిని అధికారులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ వెల్ఫేర్ జిల్లా అధికారులకు అప్పగించారు.
News December 25, 2025
అనకాపల్లి: ‘త్వరితగతిన విద్యా రుణాలు మంజూరు చేయాలి’

తల్లిదండ్రుల సివిల్ స్కోర్ చూడకుండా విద్యార్థులకు విద్యా రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో బ్యాంకు రుణాలు మంజూరుపై సమీక్ష నిర్వహించారు. కౌలు రైతులకు, పీఎం సూర్య ఘర్ పథకానికి పరిశ్రమలు, డెయిరీ, స్వయం సహాయక బృందాలకు రుణాలు అందజేయాలన్నారు. లక్ష్యానికి మించి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలన్నారు.


